Posted on 2026-04-25 17:57:36
డైలీ భారత్, ఛత్తీస్‌గఢ్: ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ప్రియుడైన కానిస్టేబుల్ భార్య, అతడి ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడు తీవ్ర గాయాలతో మరణించారు. అతడి ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ ప్రియురాలైన 25 ఏళ్ల సరోజిని భరద్వాజ్ అతడి ఇంటికి చేరుకున్నది. ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. తన కుటుంబం ప్రయాణం కోసం టిక్కెట్లు కొనడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు.
కాగా, కానిస్టేబుల్ భార్య రీనాతో సరోజిని వాగ్వాదానికి దిగింది. గొడవ బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచింది. ఆ తర్వాత రీనా, ఆమె ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. రీనాతో పాటు నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల ఆదిత్యను పదేపదే కత్తితో పొడిచింది.
అయితే కుమార్తెలు నైనా, తానియాపై సరోజిని కత్తితో దాడి చేస్తుండగా రీనా ప్రతిఘటించింది. ఆమె కాళ్లు పట్టుకుని తన పిల్లలను వదిలిపెట్టమని వేడుకున్నది. కుమార్తెలను పారిపోమని చెప్పింది. దీంతో ఒక కుమార్తె బాత్‌రూమ్‌లో దాక్కోగా, మరో కుమార్తె తప్పించుకుని బయటకు పరుగెత్తింది. పొరుగువారిని అప్రమత్తం చేసింది.
మరోవైపు పొరుగువారు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తపు మరకలున్న కత్తితో తలుపు దగ్గర ఉన్న సరోజినిని చుట్టుముట్టి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను అప్పగించారు. రీనా, ఆమె పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెతో పాటు కుమారుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది.
కాగా, కానిస్టేబుల్ లలితేష్, సరోజిని మధ్య ఉన్న సంబంధం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీస్ అధికారి తెలిపారు. శుక్రవారం కూడా ఆమె అతడి ఇంటికి రాగా నచ్చజెప్పి పంపించినట్లు తెలిసిందన్నారు. శనివారం లలితేష్ ఇంట్లో లేని సమయంలో వచ్చిన సరోజిని అక్కడ రక్తపాతం సృష్టించిందని చెప్పారు. నిందితురాలిని అరెస్ట్ చేసి ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >