| Daily భారత్
Logo




మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

News

Posted on 2026-04-25 15:58:22

Share: Share


మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

డైలీ భారత్, స్పెషల్: 

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

పగలు పూట పండుగలతో మెరిసే వీధులు

రాత్రి పడగానే నిశ్శబ్దంగా మారిపోతే

ఆ నిశ్శబ్దంలో వినిపించే ఆకలి మౌన అరుపుతో

మంజుల కలం కన్నీరు పెడుతూ

కవితలు రాస్తున్నాయి..!


హోటల్ వెలుగుల వెనుక

చెత్త బుట్టల దగ్గర అన్నం కోసం వెతికే చేతులు కనిపించినప్పుడల్లా

ఆమె గుండె ఇంకో కవితగా మారుతున్నాయి..!


బాల్యం బొమ్మలతో  ఆడుకోవ్వాలి

కాని వీధి మూలలో చేతులు చాచినప్పుడు

ఆకాశానికే ప్రశ్న వేసే ఆ చిన్నారుల కళ్ల కోసం

మంజుల అక్షరాల రూపంలో పురుడు పోసుకుంటున్నాయి..!


ఉన్నవారి ఇంటిలో పండుగల పళ్లెంలో

మిగిలిన అన్నం పడేస్తుంటే... 

పక్క వీధిలో ఖాళీ పాత్రలతో

ఒక్క బుక్క  దొరుకుతుందా…?

అని ఎదురు చూస్తున్న 

వారి ఆకలి కేకల బాధ వినిపించిన ప్రతిసారి

మంజుల హృదయం నుండి 

కవిత రూపంలో బయటకు వస్తున్నాయి... 


పొయ్యి మౌనంగా ఉన్న ఇళ్లలోని బాధగాలి తాకి ఆమె అక్షరాలు పొగలై పైకి ఎగసి..వారి క్షుద్బాధను 

ప్రపంచానికి చెబుతుంది… 


ఆకలి అంటే కేవలం కడుపు నొప్పి కాదు

మనసు చిదిమే మౌన అరుపు అని

ప్రతి కవితలో ప్రపంచానికి చెబుతుంది…


ప్లేట్లో మిగిలిన ఒక్క గింజలో

ఎవరో ఒకరి ప్రాణం దాగి ఉందని

చెత్తలో పడేసిన అన్నం

ఎవరో ఒకరి ఆకలి తీరుతున్నది

అని కవితల రూపంలో గుర్తుచేస్తుంది…


గింజ పండించే రైతు చెమటలో

భూమి గుండె చప్పుళ్లు వినిపిస్తాయని

మన ప్లేట్లో మిగిలిన ప్రతి ముద్దలో 

అతని కన్నీటి రుచి ఉంటుందని

ప్రపంచానికి గుర్తు చేస్తుంది…


చిల్లిగవ్వ లేని చేతుల్లో

నమ్మకం గింజలు నాటుతుంది...


ఆకలి లేని ఉదయం రావాలని

ప్రతి కవితలో ప్రార్థిస్తుంది మంజుల

ప్రతి పంక్తిలో ఒక వాగ్దానం —

“పంచే చేతులు పెరిగితే

ఆకలి కేకలు మౌనమవుతాయి అని చెబుతుంది...


రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >