Posted on 2026-04-25 13:40:44
సిడబ్ల్యుసి ఎదుట హాజరు పరిచేందుకు బాలిక తరలింపు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో జరుగుతున్న బాల్యవివాహాన్ని శనివారం అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతోందని రెండు రోజుల క్రితం 1098కు సమాచారం అందడంతో తహసీల్దార్ సుజాత, ఐ .సి.డీ.ఎస్. సిరిసిల్ల సీడీపీఓ ఉమారాణి , సూపర్ వైజర్ వనిత, డీ.సి.పీ.ఓ కవిత చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ స్రవంతి , పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక తల్లిదండ్రులను వివరాలు అడిగినా వారు సహకరించకపోగా తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు బాలిక చదివిన పాఠశాల నుంచి రికార్డులు సేకరించగా, 24-08-2009న జన్మించినట్లు ధృవీకరించారు. బాలిక వయస్సు చట్టపరంగా వివాహానికి తక్కువగా ఉండటంతో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి వివాహాన్ని నిలిపివేశారు. ఈ సమయంలో బాలిక బంధువులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అంగన్వాడి టీచర్ సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ ఆమెపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించిన ఘటన కూడా జరిగింది. అనంతరం బాలికను బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరు పరిచేందుకు సిరిసిల్లకు తరలించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, అలాంటి వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >