| Daily భారత్
Logo




రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం:ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-25 14:28:02

Share: Share


రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం:ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సాంకేతిక పొరపాట్లపై దృష్టి సారించండి

రైతులు అందరికీ రుణమాఫీ జరుగుతుంది

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రైతు రుణమాఫీ అమలులో నిర్లక్ష్యం, పొరపాట్లు అవకాశం ఇవ్వొద్దని షాద్ నగర్ ప్రాంత బ్యాంకర్లను అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు.

గురువారం స్థానిక క్యాంపు కార్యాలయ సమీక్ష సమావేశంలో హాజరైన పలువురు వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక బ్యాంకర్లకు పలు సూచనలను సలహాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ అమలు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు  ఇట్టి సమావేశంలో రుణమాఫీ అమలులో ఎలాంటి పొరపాట్లు అవకాశం ఇవ్వవద్దని, పకడ్బందీగా పనిచేసి రుణమాఫీ అమలు చేయాలని ఎమ్మెల్యే సమీక్షలో కోరారు. ఈ సమావేశంలో బ్యాంక్ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఏలాంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకుని రావాలని ఇదీ చాలా పెద్ద కార్యక్రమం కాబట్టీ అమలులో అధికారులపై ఒత్తిడి ఉంటుంది కానీ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. సహృద్భావ వాతావరణంలో అధికారులు పని చేయండి అని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఇది పేదల ప్రభుత్వం, రైతుల ఫ్రెండ్లీ ప్రభుత్వం మీ పరిధిలో ఉన్న ప్రతి పని చేయండి అని ఎమ్మెల్యే వారిని కోరారు. 12 డిసెంబర్ 2018 నుంచి 2024 మధ్య రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రుణమాఫీ తొలిదశలో కొన్ని సాంకేతిక సమస్యలు, ఆందోళనలు ఉంటాయని అవన్నీ త్వరలో నివృత్తి అవుతాయని ఎమ్మెల్యే తెలియజేశారు.

వ్యవసాయ శాఖా అధికారులు మాట్లాడుతూ రుణాలు రెన్యువల్ చేసుకున్న కొంతమందికి రుణమాఫీ రాలేదని తెలిపారు. కారణాలను అన్వేషించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలియజేశారు. రుణమాఫీ అమలులో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు బ్యాంకర్లు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని, సరైన మార్గదర్శకాలు ఇచ్చినందున  రుణమాఫీకి ఏలాంటి ఇబ్బందులు లేవని 90 - 95% మార్గదర్శకాల ప్రకారం రుణ మాఫీ జరుగుతుందని ఏవైనా చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని మేము సరి చేస్తున్నామని తెలియజేశారు. మా ఖాతాదారులకు మేలు జరగడం మాకు సంతోషాన్నిస్తుందని వారికోసం ఇంకా పకడ్బందీగా పని చేస్తామని హామీ బ్యాంకర్లు హామి ఇచ్చారు. షాద్ నగర్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజారత్నం మాట్లాడుతూ.... రుణమాఫీ కార్యక్రమం 2024 మొదటి విడతలో 13, 468 మందికి రుణమాఫీ వర్తిస్తుందని అట్టి రైతులుకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు సకాలంలో రైతులకు చెల్లించాలని బ్యాంకర్లకు కోరారు. ఇట్టివిషయంలో ఎవరైనా రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాని సందర్భంలో సంబంధిత మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులకు  ఖాతాకు రుణమాఫీ డబ్బులు జమ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవడం కోసం సంప్రదించాలని రైతులను కోరారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, షాద్ నగర్ శాఖ ఖాతాదారులు ఆందోళన ఆందోళన చెందవద్దని ఏడి తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా రైతుల ఖాతా నెంబర్ కు ముందు సున్నా రాని కానీ కారణంగా 546 మంది రైతులకు పంట రుణమాఫీ డబ్బులు  జమ కాలేదని ఏడి తెలిపారు. ఇట్టి విషయాన్ని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  కూడా ఇట్టి విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారని ఎడి తెలిపారు..

Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >