Posted on 2024-07-25 09:32:29
డైలీ భారత్, ఏలూరు: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డి.ఎస్.పి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరులు వృత్తులను ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్ లో విలేఖరిగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్ కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడ అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని.. హోటల్ ఏమి సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడుని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ను ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను ఇకనుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికి ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. రూ 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాలు దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తాను చెప్పి ఈ విషయాన్ని అందర్నీ అడగగా వాళ్ళు నకిలేని అధికారులు తెలిసింది వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్ చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గా దేవి పాట సహకరించి బుక్కురి దేవి ప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగా రాంబాబులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు..వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్స్ రెండు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేస్ చేదించిన ఎస్సై రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >