Posted on 2026-04-25 04:54:31
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశం మందిరం లో నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
పాల్గొని మాట్లాడుతూ అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, 252
జి ఓ ననుసరించి నియమ నిబంధనలు తప్పకుండ పాటించాలని అన్నారు.
మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు.
మీడియా రంగంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ విక్టర్, dpro తిరుమల, కమిటీ సభ్యులుగా
వి. రజనీకాంత్, మంత్రి ఆంజనేయులు, వుక్కల్కర్ రాజేందర్‌నాథ్, వేణుగోపాల చారి, సయ్యద్ కౌసర్ అలీ,
వి. శశిధర్, షేక్ మొయినుద్దీన్, బొక్కల వేణు, గంట చంద్ర శేఖర్, మహమ్మద్ ఆబిద్ , తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >