| Daily భారత్
Logo




సంప్రదింపుల ద్వారానే అభివృద్ధికి పరిష్కారం : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-22 14:49:27

Share: Share


సంప్రదింపుల ద్వారానే అభివృద్ధికి పరిష్కారం : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ చౌరస్తాలో 100 ఫీట్లతో సర్కిల్ నిర్మాణానికి ప్రణాళిక

సర్కిల్ విస్తరణపై చర్చ కోసం అఖిలపక్షం సమావేశం

హాజరైన మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, భీష్వ కిష్టయ్య, సి. ప్రతాప్ రెడ్డి, చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు

అఖిలపక్షంలో తమ వాదన వినిపించిన కాంగ్రెస్, బిజెపి, టిడిపి, బీఆర్ఎస్, సిపిఎం, బిఎస్పీ, జె.ఎస్.పి, పార్టీలు, జర్నలిస్టులు, పోలీసులు, అధికారులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని షాద్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం అందరి సూచన సలహాలను తీసుకుని అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఇందులో ఎలాంటి సందేహం లేదని, రాజకీయాలకు అసలు తావు లేదని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో పెరుగుతున్న పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకొని చౌరస్తా విస్తరణ చేపట్టడానికి ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ నియోజకవర్గం అఖిలపక్ష పార్టీలకు ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు స్థానిక మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ్య, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్థానిక నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, పట్టణ సీఐ విజయ్ కుమార్, ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ అండ్ బి డిఈ రవీందర్, సిపిఎం సీనియర్ నాయకులు ఎన్ రాజు, బిఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్, కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, సర్వర్ పాషా, నందీశ్వర్, రాయికల్ శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, చెంది తిరుపతిరెడ్డి, బాలరాజ్ గౌడ్, తోకల దామోదర్ రెడ్డి, బిజెపి నేతలు మల్చాల మురళి, వంశీ, టిఆర్ఎస్ నాయకులు యుగంధర్, మీడియా ప్రతినిధులు శరత్, మిద్దెల సత్యనారాయణ, రాజేష్, సరపు రమేష్, భాస్కర్, ధన్నారం రమేష్, శివ, రాజశేఖర్ గౌడ్, ఉర్దూ పాత్రికేయులు అర్షద్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో ఆయా నాయకుల పార్టీల అభిప్రాయాలను చర్చించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నాయకులకు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులుగా అవకాశం లభిస్తుందని, అయితే ఈ సమయంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. తనకు వచ్చిన అవకాశంతో రోడ్డు విస్తరణ పనులు పట్టణంలో చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పట్టణ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉందని పెరిగిన జనాభాకు అనుగుణంగా సరైన సదుపాయాలు లేవని పేర్కొన్నారు. అందుకే అధికారుల నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా 100 ఫీట్ల సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. నష్టపరిహారం సాధ్యసాధ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించడం జరుగుతుందని తెలిపారు. అఖిలపక్షం కోరిన విధంగా వీలైతే ముఖ్యమంత్రిని కల్పించే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మొదట ప్రభుత్వ నిబంధనలు వాటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి జరుగుతుందంటే కొంత నష్టం మరికొంత లాభం జరగవచ్చు అని దానికి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కొన్ని సందర్భాల్లో అభివృద్ధి కోసం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వాటిని ఎవరు తప్పు పట్టని అన్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అనుకున్న అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అఖిలపక్షాలకు ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికామని తన అవమానాన్ని మన్నించి మాజీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు రావడం సంతోషకరమని జర్నలిస్టులు కూడా తమ అభిప్రాయాలను చెప్పారని పేర్కొన్నారు. తమ మనసులోని అభిప్రాయాలను అందరూ చెప్పారని వాటిని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ఇంకా అవసరమైతే మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామని పెద్ద ఎత్తున దీనిపై అవగాహన కల్పిస్తామని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగకపోతే భవిష్యత్తు తరాలు క్షమించమని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ ప్రయత్నానికి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 

అభివృద్ధి విషయంలో కఠినంగా ఉండాలి - మాజీ ఎమ్మెల్యే బక్కని

అభివృద్ధి వ్యవహారాల్లో పాలకులు అధికారులు నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికి నష్టం జరగకుండా అభివృద్ధి సాధ్యపడదని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు చెప్పారు. అభివృద్ధి వ్యవహారాల్లో కొంత నష్టం కూడా ఉంటుందని వాటిని భరించి ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. అయితే ఇలాంటి ప్రణాళికలు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వాటి నిబంధనలు చట్టాలు ఎవరు ఉల్లంఘించలేరని దీనిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. విస్తరణ పనులు చేపడితే భావన యజమానులకు నష్టం జరిగితే వాటికి సంబంధించిన నష్టపరిహారం పై సాధ్యసాధ్యాలపై ఎమ్మెల్యే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని అప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురుకావని అన్నారు. వాస్తవానికి ఈ సమాజంలో ఈ భూములు ఆస్తులు ఎవరి సొత్తు కాదని ఈ భూమిపై అందరం జీవించే సమాన హక్కు ఉందని పదిమంది ప్రయోజనం కోసం కొందరికి నష్టం జరిగిన వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బక్కని నరసింహులు అన్నారు. 

పదిమందికి నష్టం జరిగినా వేల మందికి లాభం - మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

పదిమందికి నష్టం జరుగుతుందని వేలాది మందికి లాభం జరిగే పనులను ఎప్పుడు ఆపకూడదని అవి నిర్విఘ్నంగా కొనసాగాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పేరిట ప్రణాళిక చర్యలు చేపడితే అన్ని వర్గాలు దానిని సమర్థించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. అభివృద్ధి నిర్మాణ పనుల విషయంలో సాధ్య సుసాధ్యాలపై అధికారులు నిబంధన ప్రకారం వ్యవహరించాలని, స్థానిక ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని స్వయంగా సమీక్షించి అభివృద్ధికి కంకణ బదులు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. 

అందరికీ అనువుగా ఉండేట్టు విగ్రహాలు పెట్టండి - మాజీ ఎమ్మెల్యే భీష్మ కిష్టయ్య

రోడ్డు విస్తరణ పనులు లక్షలాదిమంది ప్రజలకు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా దేశ నాయకుల విగ్రహాలు అందరికీ అనువుగా పెడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు. 

అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లాలి - బిజెపి నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వీలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు అఖిలపక్ష నాయకులను తీసుకువెళ్లి అభిప్రాయాలను చెప్పే విధంగా చూడాలని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి సూచించారు. అభివృద్ధి పనులు ఎవరికైనా నష్టం జరిగితే వారికి నష్టపరిహారం ఇచ్చే విషయమై ప్రజలకు అవగాహన చేయాలని చెప్పారు. 100% అభివృద్ధి పనులు చేపట్టడం మంచిదేనని దానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. అభివృద్ధి విషయంలో బిజెపి పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. 

చౌరస్తా నలు దిశలా అభివృద్ధి జరగాలి - మున్సిపల్ చైర్మన్ నరేందర్

పట్టణ చౌరస్తాలో నలుదిక్కలకు వెళ్లే రహదారులు చట్టనిబంధనల ప్రకారం అభివృద్ధి జరగాలని దానికోసం మున్సిపాలిటీ తన పూర్తి సహకారం అందజేస్తుందని చైర్మన్ కే. నరేందర్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టే క్రమంలో పేద ప్రజలు ఎంతోమంది ఫుట్ పాతులపై జీవనం సాగిస్తుంటారని వారికి కూడా ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 

స్వరూపం మారుతుంది - సిపిఎం నేత ఎన్ రాజు

పట్టణ అభివృద్ధి సాధ్యమైనప్పుడు వాటి స్వరూపం కూడా మారుతూ ఉంటుందని దానికి తగినట్టుగా ప్రణాళికలు చేసుకొని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం నేత రాజు ఎమ్మెల్యేను కోరారు. అభివృద్ధి విషయంలో సిపిఎం పార్టీ ఎల్లవేళలా సహకరిస్తుందని తెలిపారు. పేద వర్గాలకు సామాన్యులకు నష్టం కల్పించకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. అభివృద్ధి పనులు జరిగే సమయంలో కొంత ఉత్కంఠ ఉంటుందని అయితే దానికి ప్రత్యామ్నాయ చర్యలు ముందుగా చెప్పి అందరి ఆమోదం పొందాలని చెప్పారు. సర్కిల్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

అంబేద్కర్ విగ్రహం ఉండాలి - బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్

పట్టణ చౌరస్తాలొ నూతనంగా ఏర్పాటు చేయబోయే సర్కిల్ మధ్య డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని అంబేద్కర్ చౌరస్తాగా ఇప్పటికే చలామణిలో ఉందని అందుకు తగ్గట్టు ఉండాలని చెప్పారు. 

మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ..

షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, ఎండి ఖాజాపాషా మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధిలో మీడియా పాత్రను కూడా గౌరవించి అఖిలపక్ష సమావేశంలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి పథంలో ఒక ప్రాంతం దూసుకుపోవాలంటే రోడ్లు మంచిగా విస్తరించి అందరికి సౌలభ్యంగా ఉండాలని అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అభివృద్ధి పనులు కఠినతనమైనప్పటికీ వాటిని సాధించే దిశగా అధికారులు రాజకీయ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు ఏకాభిప్రాయానికి వస్తే ఎలాంటి అడ్డంకులు ఉండవని

పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నప్పటికీ పట్టణ అభివృద్ధి విషయంలో మీడియాను వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం అభినందనీయమని అన్నారు. నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా అధికారులు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు. అభివృద్ధి విషయంలో మీడియా పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు నాయకులు కౌన్సిలర్లు తదితర అధికారులు మాట్లాడారు. చేసే పనిలో నాణ్యత ఉండాలని విమర్శలు ఎదుర్కోవద్దని అందరికీ ప్రయోజనాత్మకం చేకూరే విధంగా ఉండాలని పలువురు సూచించారు. చౌరస్తా సర్కిల్ లో చేపడుతున్న ప్రణాళికా చర్యలకు తమ వంతు సహకారం ఉంటుందని అందరు ఏకగ్రీవ తీర్మానం చేశారు..

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >