Posted on 2024-07-19 07:16:26
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కంట్రోల్ కమిటీ చైర్మన్, కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ (75) వ్యక్తిగత కారణాలతో ఖమ్మంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రాయల చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఖమ్మం కార్యాలయానికి ప్రజల సందర్శనార్థం తరలించారు. ఎంపీలు రేణుకాచౌదరి, రాఘురామరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు సందర్శించి నివాళులు ఆర్పించారు. రాయల చంద్రశేఖర్ మృతి పట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సంతాపం ప్రకటించారు. అనంతరం పిండిప్రోలులో ఆయన అంతిమ యాత్ర నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే విప్లవోద్యమానికి ఆకర్షితుడైన రాయల చంద్రశేఖర్ పీడీఎ్‌సయూలో కీలకంగా పనిచేశారు. 1975లో విప్లవోద్యమంలో రహస్య కార్యకర్తగా అడవిబాట పట్టారు. ఆ తర్వాత రైతు కూలీ సంఘం నాయకుడిగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో పార్టీ నిర్మాణాకి కృషి చేశారు..
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >