Posted on 2024-07-14 18:07:42
వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచి వెంటనే అమలు చేయాలి
ఎన్పిఆర్డి రంగారెడ్డి జిల్లా 3వ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు కరువునెల్లి వెంకట్,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి,
షాద్ నగర్ ఎన్.పి.ఆర్.డి రాష్ట్రస్థాయి మూడవ మహాసభలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం అభివృద్ధిని అమలు చేయాలని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని బుగ్గారెడ్డి గార్డెన్ లో రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 3వ మహాసభను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షుడు కరువునెల్లి వెంకట్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్కిని రాజు, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, డివిజన్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ స్థానిక బిఆర్ఎస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు పలువురు మాట్లాడుతూ.... నేటి సమాజంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ 3016 నుండి 6016 వరకు పెంచాలని, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 40% నుండి 100% ఉన్న దివ్యాంగులకు పెండింగ్ లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వికలాంగుల ఉద్యోగ నియామకాలల్లో శరీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని, వికలాంగుల పెన్షన్ 6000 లకు పెంచి వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల కోసం ఉద్యమం చేస్తమని ఎన్పి ఆర్డి రాష్ట్ర అధ్యక్షుడు కే.వేంకట్ హెచ్చరించారు.దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో అక్రమాలు ఉన్నాయని, ఆర్థిక నిర్వహణ సక్రమంగా అమలు చేయడం లేదని, నిధుల పర్యవేక్షణ చేయడంలో వికలాంగుల సంక్షేమ శాఖ విఫలం చెందుతుందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ వెల్లడించిందన్నారు .ఆర్థిక సంవత్సరం చివర్లో నిధులు విడుదల చేయడం ద్వారా లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి. వికలాంగుల పెన్షన్ నిధులను ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి అనేక పథకాల ప్రచారానికి వినియోగిస్తున్నారు. జమ్మూకాశ్మీర్, గోవా, బీహార్ రాష్ట్రాలలో 2.83 కోట్లు ప్రభుత్వ ప్రచారం కోసం వినియోగించారని కాగ్ నివేదిక వెల్లడించింది.ప్రపంచ జనాభాలో 16% మంది వికలాంగులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది .దేశంలో 10-15 శాతం మంది వికలాంగులు ఉన్నారని అంచనా.పాలకులు అనుసరిస్తున్న విధానాల మూలంగా వికలాంగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ డిజేబులిటీ 2021- 22 వార్షిక రిపోర్ట్ ప్రకారం 67,09,894 మందికి యూడిఐడి కార్డులు జారీచేసింది.దేశవ్యాప్తంగా 1,74,25,094 మందికి వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ అయితే 67.09 లక్షల మందికి యూడిఐడి కార్డులు జారీ చేసినారు. పాఠశాలలకు వెళుతున్న వైకల్యం కలిగిన విద్యార్థులను గుర్తించేందుకు ప్రతి ఐదేండ్లకు ఒకసారి సర్వే చేయాలని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 17( ఏ) పేర్కొందని అన్నారు.కానీ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి సర్వేలు చేయడం లేదు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల ద్వారా వికలాంగుల వివరాలను గ్రామ స్థాయిలో సేకరిస్తే వికలాంగుల సమగ్ర సమాచారం సేకరించాలని డిమాండ్చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు లోపం ఉందని సుప్రీం కోర్ట్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటని అన్నారు. 2011నుండి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ లలో 300 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, 300 రూపాయలతో ఎట్లా బ్రతుకుతారని ప్రశ్నించారు. ధరల పెరుగుదల సూచికి అనుగుణంగా పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలలో ఖాళీగా ఉన్న వికలాంగుల పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగుల విద్యా పట్ల కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదన్నారు. వికలాంగులలో విద్య అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలులో ఉన్న వాటి అమలు పట్ల ఎందుకు శ్రద్ధ లేదని అన్నారు. వికలాంగుల విద్య కోసం ప్రత్యేక విద్యా పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల కోసం అమలులో ఉన్న నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసీ, అంటీజం యాక్ట్ వంటివి అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందుతుందని అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు అశాన్నగారి భుజంగ రేడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లెక్కల ప్రకారం 10.48 లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ తెలంగాణ దిశ బ్లెడ్ స్టడీ ఇండియా రిపోర్ట్ ప్రకారం 43.02 లక్షల మంది ఒక్కటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిగిన వారు ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12.2శాతం వికలాంగులున్నారని, రాజకీయ పార్టీలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పెన్షన్ 6000 పెంచి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉచిత విద్యుత్ ప్రయాణ సౌకర్యం, శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని, 2016 ఆర్పిడబ్ల్యుడి చట్టం అమలు కోసం, నామినేటెడ్ పదవులలో రిజర్వేషన్స్ అమలు కోసం అసెంబ్లీలో చట్టం చేయలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రదన కార్యదర్శి జేర్కోని రాజు జిల్లా ఉపాధ్యక్షుడు చేగురి శేఖర్ జిల్లా సహయ్య కార్యదర్శి నాగార్జున శ్రీనివాస్ అబ్దుల్లా పుర్ మెట్టు మండల అధ్యక్షుడు అంతటి మహేష్ గౌడ్ మంచాల మండల నాయకులు బాల్ రాజ్ శంకర్‌పల్లి అధ్యక్షుడు కసాల యదయ్య చెవేళ్ళా అధ్యక్షుడు బోడ శ్రీనివాస్ మోయినబాద్ మండల అధ్యక్షుడు ఎరపుల జానయ్య ఇబ్రహీంపట్నం మండల నాయకులు కాకి నర్సింహ తదితరులు పాల్గొన్నారు..
2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు
Posted On 2026-03-05 22:09:37
Readmore >
ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి
Posted On 2026-03-05 22:08:10
Readmore >
ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి
Posted On 2026-03-05 22:00:22
Readmore >
కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్
Posted On 2026-03-05 21:59:32
Readmore >
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >