| Daily భారత్
Logo




కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరో ఎమ్మెల్యే

News

Posted on 2024-07-13 08:51:55

Share: Share


కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరో ఎమ్మెల్యే

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లో అరెకపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానిం చారు. 

అరెకపూడి గాంధీతోపాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మువ్వ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

మరో రెండు రోజుల్లో హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీని వాసరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది.అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున 39 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఆ స్థానంకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాడు. 

దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 38కి చేరింది. గత ఆర్నెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

శుక్రవారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఇవాళ శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకునేందుకు సిద్ధమై నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >