Posted on 2024-07-13 08:16:21
డైలీ భారత్, హనుమకొండ జిల్లా : కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడడం జరిగింది.
అదృష్టం కొద్దీ ఆ రూంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం .
ఇటీవల ఫ్యాను ఊడి మీద పడి తల పగిలిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
అధికారులు హడావిడి చేశారు కానీ హాస్టల్ లో ఉన్న వారిని చేంజ్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు.
తరుచు ప్రమాదాలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీలో ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పురాతన భవనాలలో హాస్టల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్న పరిస్థితి.
ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అన్ని వసతులు ఉన్న భవనాలలోకి హాస్టల్స్ మార్చాలని విద్యార్థులు వేడుకుంటున్న పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో నెలకొంది.
కార్పొరేషన్ అధికారులు వర్షాకాలం నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల క్రితం వాటి జాబితా సిద్ధం చేసి కూల్చివేయాలని అన్నప్పటికీ.... నగరంలోని కాలనీలలో ఉన్న భవనాలను చూస్తారే తప్ప ప్రభుత్వ హాస్టల్స్ కానీ ప్రభుత్వ ఆఫీసులను కానీ పట్టించుకోరు అధికారులు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >