Posted on 2024-07-08 13:28:26
ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి:మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. .బి.బాలస్వామి ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మెదక్ మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన చరణ్ తన తల్లితండ్రి మరణించినారని నా తల్లి తండ్రులు ఒక ఎకరం పది గుంటలు భూమి కొని పట్టా చేసుకోలేదని నా తల్లి తండ్రులు మరణించినారని ప్రస్తుతము మేము కాస్తులోనే ఉన్నామని అయినప్పటికి మాకు అట్టి పొలం అమ్మిన వారు ఈ పొలం మాదే అని దౌర్జన్యం చేస్తున్నారని కావున వారి పై చట్టపరమైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ రూరల్ సి.ఐ కి సూచనలు చేయటం జరిగింది. అలాగే కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన హన్మంత రెడ్డి కి పెద్ద శంకరంపేట మండలం తిరుమాలపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 261/ఉనందు 0-1250 గుంటల భూమిని తమ తాతల ద్వారా వంశపారంపర్యంగా వచ్చిందని ఈ భూమిలో మా పూర్వీకుల నుండి ప్రస్తుతం వరకు మేమే కబ్జాలో ఉన్నామని ఇట్టి భూమిని పెద్ద శంకరంపేట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా మా భూమిని కబ్జా చేసి అట్టి భూమిలో బేస్మెంట్ వరకు నిర్మాణాన్ని చేపట్టినారని కావున వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని అల్లాదుర్గ్ సి.ఐ కి సూచనలు చేయటం జరిగింది.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >