Posted on 2024-07-08 13:09:46
మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. విమాన పైలట్ మృతి
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మేడ్చల్ జిల్లా లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో శిక్షణలో ఉన్న విమాన పైలట్ శ్రీకరన్ రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.
కారులో ఉన్న శ్రీకారన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.యాక్సిడెంట్ పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు.
మృతుడు శ్రీకరన్ రెడ్డి స్వస్థలం గజ్వేల్ గా గుర్తిం చారు. నేరెడ్ మీట్ ప్రాంతంలో కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. బ్యాంకాక్ లో శిక్షణ పొందుతున్న పైలట్ శ్రీకారన్ రెడ్డి, గత వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చాడు.
యాదగిరిగుట్టకు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పిఇవ్వాళ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయలుదేరాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >