| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైయస్సార్ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైయస్సార్ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వైయస్సార్ విగ్రహం వద్ద 75వ జయంతి నివాళి

ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు పండ్లు, బ్రెడ్ ఉచితంగా పంపిణి

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కె.చెన్నయ్య, మైనారిటీ నేత ఇబ్రహీం ఆధ్వర్యంలో కార్యక్రమం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని 

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చౌరస్తాలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య, మైనార్టీ నాయకుడు ఇబ్రహీం ఆధ్వర్యంలో జరిగిన ఈ నివాళి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడి గుండెల్లో గూడు కట్టుకున్నారని అన్నారు. పేద ప్రజల ఆరోగ్య విషయంలో కోటాను కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజల జీవితాలను, ఆరోగ్యాలను కాపాడిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కుతుందని అన్నారు. నియోజకవర్గంలోని కేశంపేట మండలంలో ఓకే గ్రామంలో 400 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. జల యజ్ఞం పేరిట ఉమ్మడి పాలమూరు జిల్లాలో భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు మహర్దశ కల్పించారని అన్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. అనేక అభివృద్ధి సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు తీసుకువచ్చారని, పేద ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని తను భౌతికంగా మరణించినా ఇంకా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాల అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు పండ్లు, బ్రెడ్ ఉచితంగా ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు..

Previous భారీ నిర్మాణాలు కూల్చివేత.. అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్
Next వైఎస్ఆర్‎కు ఘన నివాళి....జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ.
ADVERTISEMENT