| Daily భారత్
Logo




వైఎస్ఆర్‎కు ఘన నివాళి....జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ.

News

Posted on 2024-07-08 11:41:10

Share: Share


వైఎస్ఆర్‎కు ఘన నివాళి....జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ.

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన తరువాత తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరకున్న తల్లి విజయమ్మను.. వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ‎దివంగతనేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతోపాటు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని ఇచ్చారు.

‘వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజు తమకు పండుగ రోజని.. అలాగే కోట్లాది కుటుంబాలు ఇవాళ మహానేతను జ్ఙాపకం చేసుకుంటున్నాయన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రాజన్న పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యం అని కీర్తించారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో చూపిన ధైర్యసాహసాలు తమకు మార్గం అని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరివరకూ తాము కృషి చేస్తామని తెలిపారు

అనంతరం వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయకు చేరుకుని తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆమెతో కూడా తల్లి విజయమ్మ పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. ఒక తల్లిగా ఇద్దరు బిడ్డలను సమానంగా చూస్తానన్న సందేశాన్ని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా తెలిపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు భర్త అనిల్, కొడుకు, కోడలు, కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘాట్ లో తండ్రికి నివాళి అర్పించిన తరువాత వైఎస్ షర్మిల మంగళగిరి బయలుదేరి వెళ్లారు.

Image 1

ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించే నెపంతో ఇళ్లలో చోరీలు

Posted On 2026-03-11 22:05:47

Readmore >
Image 1

విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

Posted On 2026-03-11 20:27:35

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

Posted On 2026-03-11 20:23:40

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు

Posted On 2026-03-11 20:19:53

Readmore >
Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-03-11 18:48:15

Readmore >
Image 1

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

Posted On 2026-03-11 18:46:41

Readmore >
Image 1

పట్టపగలే మట్టి అక్రమ రవాణా

Posted On 2026-03-11 18:39:30

Readmore >
Image 1

మార్చి 15న హమాలీ మహాగర్జనను జయప్రదం చేయండి

Posted On 2026-03-11 18:31:11

Readmore >