| Daily భారత్
Logo




విభజన హామీల పరిష్కారం, ప్రజా శ్రేయస్సు కోసమే సీఎంల భేటీ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-06 21:44:15

Share: Share


విభజన హామీల  పరిష్కారం, ప్రజా శ్రేయస్సు కోసమే సీఎంల భేటీ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నల్లమల్ల ఫారెస్ట్  అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో టూరిజం కార్యకలాపాల అభివృద్ధికి పర్యటన

రెండు రోజుల అధ్యయన పర్యటన ముగింపు సందర్భంగా ప్రెస్ మీట్

మీడియా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రగతిభవన్ తెలంగాణ ప్రజల ఆత్మగౌర ప్రతీక - అందులో ఇద్దరు ద్రోహులు భేటీ" అవుతున్నారు అని నమస్తే తెలంగాణ దినపత్రికలో వ్యాసం రాసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. నల్లమల్ల ఫారెస్ట్  అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో టూరిజం కార్యకలాపాల అభివృద్ధికి పర్యటనలో భాగంగా రెండవ రోజు అచ్చంపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు అధికారులు, మంత్రుల సమక్షంలో జరిగిన ముఖ్య మంత్రుల భేటీ విజయవంతం కావాలని, ఇరు రాష్ట్రాలకు మేలు జరగాలని తెలంగాణ పై ప్రేమ ఉన్న వారు కోరుకోవాలి అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ గతంలో ముఖ్య మంత్రుల భేటీ కేవలం ఇద్దరు సిఎంల మధ్యనే జరిగింది. ఆ మీటింగ్ వారి సొంత అవసరాలు, కాంట్రాక్టులు కోసమే జరిగింది అని పేర్కొన్నారు. గతంలో జరిగిన కేసీఆర్ - జగన్ భేటీలో చీఫ్ సెక్రటరీ పాల్గొనలేదనీ, మీటింగ్ మినిట్స్ కూడా రాసుకోలేదనీ అంటే ఆ భేటీలు రాష్ట్ర శ్రేయస్సు కోసం కాదని తెలియజేశారని అన్నారు. తెలంగాణ విభజన హామీలపై ఏనాడూ చర్చించలేదనీ అందుకే తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తరువాత కూడా విభజన హామీలు, ఖమంలో బలవంతంగా విలీనం చేయబడ్డ 7 మండలాల గురించి, బకాయిలు గురించి చర్చిస్తున్నము అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరించారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల అధికారం అప్పగిస్తే మొన్నటి వరకు విభజన హామీల అమలు గురించి, విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ లో ఉన్న 89 ప్రభుత్వ కంపెనీలు, 10 షెడ్యూల్ లో ఆన్న 107 శిక్షణ సంస్థలు మరియు ఇతర సంస్థల మధ్య విభజన గురించి అమలు, బకాయిలు, ఉద్యోగుల విభజన పై  పరిష్కారానికి కృషి చేయలేదు అని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కంటే జగన్ మరియు రోజాల స్నేహానికి అధిక ప్రాధన్యతను ఇచ్చారని వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. ఎందుకంటే గతంలో ఆంధ్రకు వెళ్లి గోదావరి నీళ్ళతో రాయలసీమనీ రతనాల సీమ ను చేస్తా అని చెప్పడమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు..

Image 1

విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

Posted On 2026-03-11 20:27:35

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

Posted On 2026-03-11 20:23:40

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు

Posted On 2026-03-11 20:19:53

Readmore >
Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-03-11 18:48:15

Readmore >
Image 1

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

Posted On 2026-03-11 18:46:41

Readmore >
Image 1

పట్టపగలే మట్టి అక్రమ రవాణా

Posted On 2026-03-11 18:39:30

Readmore >
Image 1

మార్చి 15న హమాలీ మహాగర్జనను జయప్రదం చేయండి

Posted On 2026-03-11 18:31:11

Readmore >
Image 1

పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు

Posted On 2026-03-11 18:26:29

Readmore >