| Daily భారత్
Logo




హోటళ్ల బాగోతం మరి ఇంత దారుణమా..?

News

Posted on 2024-07-06 22:01:30

Share: Share


హోటళ్ల బాగోతం మరి ఇంత దారుణమా..?

వరంగల్ లో హోటళ్ల బాగోతం మరి ఇంత దారుణమా..?

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: వరంగల్ నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. పురుగులు పట్టిన కిరాణా సరకులు, కళ్లిపోయిన మాంసం, మళ్లీ మళ్లీ వాడే వంట నూనె చూసి షాకయ్యారు.

ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, స్ట్రీట్ ఫుడ్ ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హనుమకొండలోని థౌజండ్ పిల్లర్స్ హోటల్ సహా పలు పేరుపొందిన హోటళ్లల్లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

అధికారుల సోదాల్లో పలు హోటళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏ ఒక్క హోటల్ యాజమాన్యం కూడా నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఫుడ్ సేఫ్టీ జోనల్ ఆఫీసర్ అమృత శ్రీ తేల్చి చెప్పారు. తనిఖీల్లో కుళ్లిపోయిన చికెన్, కాల పరిమితి ముగిసిన మసాలా దినుసులు, మళ్లీమళ్లీ ఉపయోగిస్తున్న వంటనూనె గుర్తించారు. 

పప్పు దినుసులు, పల్లీలు, ఉప్మారవ్వ సహా మరికొన్ని కిరాణ సరుకుల్లో పురుగులను గుర్తించారు. క్యాలిటీ పాటించని యాజమాన్యంపై జోనల్ అధికారి అమృత శ్రీ మండిపడ్డారు. నాణ్యమైన ఆహార పదార్థాలను ప్రజలకు సరఫరా చేయని, క్వాలిటీ పాటించని యాజమాన్యాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.

ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం మెుదలైన నేపథ్యంలో ప్రజలు జ్వరాలు, జలుబు, దగ్గు, డయేరియా వంటి రోగాలతో ప్రభుత్వాసుపత్రులు నిండిపోతున్నారు. కొంతమంది కల్తీ ఆహారం తిని ఆస్పత్రుల పాలవుతున్నారు. హోటళ్లల్లో ఆహార పదార్థాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నప్పటికీ నాణ్యత విషయంలో తగిన ప్రమాణాలు పాటించడం లేదంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలపై చెలగాటం ఆడే ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు.

Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-03-11 18:48:15

Readmore >
Image 1

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

Posted On 2026-03-11 18:46:41

Readmore >
Image 1

పట్టపగలే మట్టి అక్రమ రవాణా

Posted On 2026-03-11 18:39:30

Readmore >
Image 1

మార్చి 15న హమాలీ మహాగర్జనను జయప్రదం చేయండి

Posted On 2026-03-11 18:31:11

Readmore >
Image 1

పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు

Posted On 2026-03-11 18:26:29

Readmore >
Image 1

మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి

Posted On 2026-03-11 17:21:24

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

Posted On 2026-03-11 16:27:50

Readmore >
Image 1

స్పా సెంటర్ పై పోలీసుల దాడి

Posted On 2026-03-11 16:09:10

Readmore >