ప్రభుత్వ హాస్టళ్ళల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రైవేట్ స్కూల్ లకు ధీటుగా విద్య అందించాలని, రాబోవు రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూళ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ల సముదాయంగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీ, మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపాల్ లతో మరియు స్పెషల్ ఆఫీసర్లతో గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని స్కూల్ లలో ఉన్న పెండింగ్ సమస్యలను తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ హాస్టల్లో నాణ్యమైన విద్య అందించాలని కోరారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ లపై, ప్రభుత్వం పై ఉందని ఎమ్మెల్యే తెలిపారు.