| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

6 వేల పెన్షన్ పెంపు పై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేత : రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి

6 వేల పెన్షన్ పెంపు పై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేత : రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని రంగారెడ్డి జిల్లా వికలాంగుల హక్కుల   జాతీయ వేదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ శశాంక్ కు వినతి పత్రం అందజేశారు. 

వినతి పత్రంలో పొందుపరిచిన అంశాలు...కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ 300 రూపాయల నుండి 3000లకు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ 6000 లకు పెంచాలని  విజ్ఞప్తి చేస్తుంది.2011నుండి కేంద్ర ప్రభుత్వం వాటా పెన్షన్లలో కేవలం 300 రూపాయలు మాత్రమే ఉంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలి. ధరల పెరుగుదల సూచి ఇండెక్స్ కు పెన్షన్స్ ను అనుసంధానం చేయాలి. ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న పెన్షన్ వాటాను 3000 లకు పెంచాలని ఎన్పి ఆర్డి డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6000లకు పెంచి వెంటనే అమలు చేయాలన్నారు. 2024 జనవరి నుండే పెరిగిన పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి 7నెలలు గడుస్తుంది. పెన్షన్స్ పెంపు కోసం 44,49,767 మంది లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. కొత్త దరఖాస్తు చేసిన 24.84 లక్షల మందికి ఇప్పటికి పెన్షన్ మంజూరు కాలేదు.2014 రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్స్ మంజూరుకు ఆదాయ పరిమితి విధిస్తూ జీవో 17ను విడుదల చేసింది. దీన్ని వెంటనే రద్దు చేయాలి. 2015 కంటే ముందు సదరం సర్టిఫికెట్ పొందిన వారి ఆన్లైన్లో ప్రింట్ తీసుకునే అవకాశం లేదు.2015 కంటే ముందు ఇచ్చిన సదరం సర్టిఫికెట్స్ లను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలి.ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల గుర్తింపు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి.ప్రతి నెల 5వ తేదీలోపు పెన్షన్స్ పంపిణి చేసే విదంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న మహిళా శక్తి క్యాంటిన్లలో వికలాంగులకు 5 శాతం కేటాయించే విదంగా చర్యలు తీసుకోవాలి. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలావేన్స్ కోసం లబ్దిదారుల గుర్తింపు పక్రియను వెంటనే పూర్తి చేయాలని పలు అంశాలను మెమోరండం లిఖితపూర్వకంగా అందజేశారు. త్వరితగతిన పెన్షన్ పెంపు పై నిర్ణయం తీసుకుని  అమలయ్యేలా చూడాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్కొని రాజు , జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్, షాద్నగర్ డివిజన్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous మాజీ ఎంపీ నాగేశ్వర రావు చెందిన మదుకాన్ కంపెనీలో కోల్ కతా పోలీసుల సోదాలు
Next ఎంపిటిసి ,జెడ్పిటిసి సభ్యుల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT