Posted on 2026-03-13 03:49:15
10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్
డైలీ భారత్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ అధికారిని అరెస్ట్ చేశారు. మోత్కూర్‌లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అకౌంటెంట్ మొహమ్మద్ ఖదీర్‌ను రూ.10,000 లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, ఒక ఉద్యోగి జీత బిల్లును ప్రాసెస్ చేయడానికి ఖదీర్ రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. డబ్బును ఫోన్‌పే ద్వారా పంపించాలని సూచిస్తూ, తన ఖాతాతో పాటు మరో సహోద్యోగి ఖాతాకు కూడా మొత్తాన్ని పంపించాలని కోరాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉచ్చుపన్ని నిందితుడిని పట్టుకున్నారు.
లంచం స్వీకరించిన సీనియర్ అకౌంటెంట్ మొహమ్మద్ ఖదీర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, అతడిని హైదరాబాద్‌లోని SPE & ACB కేసుల విచారణకు సంబంధించిన మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >