| Daily భారత్
Logo




ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్‌ షాక్‌…. బెయిల్ నిరాకరణ

News

Posted on 2024-07-01 18:06:59

Share: Share


ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్‌ షాక్‌…. బెయిల్ నిరాకరణ

డైలీ భారత్, ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కవిత పటిషన్‌ను తిరస్కరిస్తూ.. బెయిల్‌కు నిరాకరించింది. ఈ ఏడాది మార్చిలో లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన కవిత.. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.

అయితే కవిత ఇంతకుముందు బెయిల్‌ కోసం రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేసింది. కానీ ఆమె బెయిల్‌ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కవిత.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. లిక్కర్‌ కేసులో 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కవిత తరఫు న్యాయవాది వాదనతో సహా.. సీబీఐ, ఈడీ వాదనలు విన్న కోర్టు జులై 1కి తీర్పును రిజర్వు చేసింది. చివరికి ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ నిరాకరించడంతో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగినట్లైంది.

Image 1

మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.

Posted On 2026-03-14 17:37:18

Readmore >
Image 1

రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Posted On 2026-03-14 14:28:12

Readmore >
Image 1

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

Posted On 2026-03-14 13:05:35

Readmore >
Image 1

గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"

Posted On 2026-03-14 11:41:04

Readmore >
Image 1

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-14 11:10:04

Readmore >
Image 1

వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

Posted On 2026-03-14 08:10:42

Readmore >
Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >