Posted on 2024-07-01 18:05:06
కొత్తకోటలో సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ
హాజరైన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దేశ యువతకు దిక్సూచిగా నిలిచిన మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర నియోజక వర్గంలోని కొత్తకోట మండల పరిషత్ ప్రాంగణంలో ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో శుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిమ రియు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడారు.. సుభాష్ చంద్రబోస్ , భారత స్వాతంత్ర్య ఉద్యమం యొక్క అత్యంత ప్రముఖ నాయకులలో ఒకరని, తన శక్తివంతమైన నినాదాలు మరియు ఉత్తేజకరమైన ప్రసంగాలతో లెక్కలేనన్ని వ్యక్తులను ప్రేరేపించిన ఒక ప్రభావవంతమైన శక్తి అని అన్నారు. బ్రిటీష్ వలస పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడంలో అచంచలమైన నిబద్ధతతో, స్వేచ్ఛా మరియు ఐక్య భారతదేశం కోసం అతని దృష్టిని సంగ్రహించే అనేక రకాల నినాదాలు అనుసరించేలా చేసిందని అన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ పాలక వర్గం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని సన్మానం చేశారు. దేవరకద్ర ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, జడ్పిటిసిలు మరియు మాజీ సర్పంచ్ లు, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >