Posted on 2024-07-01 13:59:15
ఆర్టీసీ బస్సు.. అందిస్తుంది ఉషస్సు..
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్"
ప్రయాణికుల సౌలభ్యమే ప్రభుత్వ లక్ష్యం..
అందుకే మహిళలకు ఉచిత ప్రయాణం.
రైట్ రైట్ అంటూ బస్సులో ప్రయాణం... ప్రయాణికులతో ముచ్చట్లు
త్వరలో రానున్న మరో ఏడు బస్సులు..
డిపోలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిరుపేద ,సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నిత్యం రవాణా సదుపాయాన్ని కల్పించే ఆర్టీసీ బస్సులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్త ఉషస్సులను సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణం నుంచి వివిధ గ్రామాలకు నూతనంగా 9 బస్సులను సోమవారం ఆయన ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక బస్ డిపోలో వాటర్ ప్లాంట్ ను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. దీనిని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 17 బస్సులు డిపోలకు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ప్రస్తుతం 9 బస్సులు వచ్చాయని ఆయన వెల్లడించారు. మిగతా బస్సులు సిద్ధంగా ఉన్న డిపోలో తగిన సిబ్బంది లేనందున కొంత జాప్యం జరిగిందని వెల్లడించారు. గతంలో రద్దయిన బస్సులను పునరుద్ధరించడంతోపాటు కొత్త రూట్లో ప్రయాణికుల కోసం బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. డిజిల్ ఆటోలలో ప్రయాణం వల్ల ప్రయాణికులు రోడ్డు ప్రమాదాలకు గురై ఇబ్బందుల పాలవుతున్నారని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో స్వేచ్ఛగా ప్రయాణం చేయాలని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది డిపోలో బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గది లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నేను తగిన విదంగా స్పందిస్తూ త్వరలోనే గదిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రయాణికులకు తగిన షెల్టర్లు లేకపోవడం వల్ల ఎండలో బస్సుల కోసం ఇబ్బంది పడవలసి వస్తుందని పాత్రికేయులు దృష్టికి తీసుకురాగా, రెండు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిత్యం పనుల మీద వెళ్లే ఉద్యోగులు, కార్మికులు, కూలీలు అదేవిధంగా చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని రూట్లలో బస్సులు నడిపేలా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
శంకరన్న రైట్..రైట్..
షాద్ నగర్ పరిధిలో వివిధ గ్రామాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయం ఎలా ఉందో పరిశీలించేందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బస్సు ప్రయాణం చేశారు. తోటి ప్రయాణికులతో ముచ్చట్లు పెట్టి సమస్యలపై అనేక విషయాలు మహిళల నుండి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఏలా ఉంటుందని వారీ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వారు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం తద్వారా సమాజం బాగుపడుతుందని వారితో ముచ్చటించారు. బస్సు ఎక్కిన ఆయన షాద్ నగర్, లింగారెడ్డిగూడెం, చంద్రయన్ గూడా, నందిగామ, విజయలక్ష్మి, కొత్తూరు, తీగాపూర్, ఫాతిమాపూర్, చేగూర్ గ్రామాల మీదుగా ఆయన ప్రయాణం చేశారు. ఎప్పటినుంచో బస్సు సదుపాయం కావాలని కోరుతున్న కన్హ భక్తుల కోసం కూడా ఆయన బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉషతోపాటు, స్థానిక నేతలు జడ్పిటిసి వెంకటరామిరెడ్డి, ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి, ముబారక్ అలీ ఖాన్, అందే మోహన్ లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >