Posted on 2023-10-22 17:18:14
డైలీ భారత్, హైదరాబాద్:కేసీఆర్ కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్బుతమని గొప్పలు చెప్పారని, బస్సులు పెట్టి రైతులను, నేతలను తీసుకెళ్లి కాళేశ్వరం చూపించారని అన్నారు.
పంపు హౌసులు మునిగినప్పుడు కాంగ్రెస్ నేతలను చూడనివ్వలేదని, ఇప్పుడు ఎలాంటి వరదలు లేకుండానే ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందని, ఇది కేసీఆర్ అవినీతికి నిదర్శనమని రేవంత్ రెడ్డి విమర్శించారు..
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఎన్నోసార్లు చెప్పారని, కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెబుతూనే ఉన్నామని, ఇప్పటికైనా దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తున్నామన్నారు.
కేసీఆర్ గొప్ప ఇంజినీరుగా చెప్పుకుని రూ.లక్ష కోట్లు వృథా చేశారని, ప్రాజెక్టుపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపించాలన్నారు. సిట్టింగ్ జడ్జితో ప్రాజెక్టు పనులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు...
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >