డైలీ భారత్, సిరిసిల్ల: మన పురాణాల ప్రకారం ఆయుధ పూజ విజయదశమి ముందు రోజు నిర్వహిస్తారు. ఆయుధ పూజ అంటే ఎవరి వృత్తికి సంబంధించిన వారి పనిముట్లను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. పురాణాల ప్రకారం దుర్గాదేవి మహిషాసుర మర్ధినిగా రాక్షసులను సంహరిస్తుంది. కాబట్టి ఆరోజున ఆయుధాలకు పూజలు నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి మన ఇళ్లలో, మన వృత్తి పరంగా ఉండేటటువంటి సాధనాలను పూజ చేయటం ద్వారా విజయం కలుగుతుందని నమ్ముతారు. మనం పూజించవలసిన పనిముట్లు లేదా ఆయుధాలను శుభ్రం చేసి వాటికి పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించి వాటిని వరుస క్రమంలో పెడతారు. అలా పెట్టిన సాధనాలకు గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయతో దిష్టి తీసి దానిని పగల కొడతారు. ఈ విధంగా వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు, ఈ విధంగా ప్రతి రంగంలో పనిచేసేటటువంటి అన్నిరకాల యంత్రాలకి కూడా దశమి కి ముందు రోజు ఈ ఆయుధ పూజను నిర్వహిస్తారు. ఇలా చేయడం ద్వారా మనకి కూడా విజయం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
Devotional