Posted on 2024-05-27 20:44:03
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్.పి .ఎస్.మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో తూప్రాన్ పట్టణానికి చెందిన మహాల్దార్ గాయత్రి తనకు తేదీ:02.09.2022 నాడు రెండవ విడతలో తూప్రాన్ మున్సిపాలిటీ పరిదిలోని సర్వే నెంబర్ 325 నందు ఫ్లాట్ నెంబర్ జి1 బ్లాక్ నెంబర్ 47 లో డబుల్ బెడ్ రూమ్ మంజురి అయ్యిందని కాని అట్టి ఫ్లాట్ లో వేరే వాళ్ళు ఉన్నారని మాకు అలాట్ అయిన ఫ్లాట్ ని ఖాళీ చేసి ఇవ్వమని అడిగితే తన పై దౌర్జన్యం చేస్తున్నారని కావున పైన తెలిపిన వారిపై చట్టపరమైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని తూప్రాన్ ఎస్.ఐ కి సూచనలు చేయటం జరిగింది. అలాగే హవేలి ఘనపూర్ గ్రామానికి చెందిన కమ్మరి నిర్మల తన భర్త తేదీ:03.01.2024 నాడు రోడ్డు ప్రమాదంలో మరణించినాడని తన భర్త మృతికి కారణం అయిన వారిపై చర్య తీసుకుని తనకు ఇన్స్యూరెన్స్ ఇప్పించగలరని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ పట్టణ ఎస్.హెచ్.ఓ కి సూచనలు చేయటం జరిగింది.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >