| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వ్యవసాయ రైతులకు అవగాహన సదస్సు : వ్యవసాయ శాఖ అధికారి రజిత

వ్యవసాయ రైతులకు అవగాహన సదస్సు : వ్యవసాయ శాఖ అధికారి రజిత

మాసాయిపేట చావడి దగ్గర ఏఈఓ వ్యవసాయ శాఖ అధికారి రజిత ఆధ్వర్యంలో రైతులకు సూచన

ప్రభుత్వ డీలర్ల దగ్గరనే కొనుగోలు చేయాలి రసీదు మాత్రం మర్చిపోవద్దు వ్యవసాయ అధికారి వెల్లడి

వ్యవసాయ రైతులకు అవగాహన సదస్సు పాల్గొన్న ఎంపిటిసి కృష్ణారెడ్డి రైతులు

డైలీ భారత్, మాసాయిపేట:మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయిపేట  గ్రామంలో చావడి దగ్గర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల కొనుగోలు విషయంలో రైతులకు అవగాహనా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏఈఓ రజిత వ్యవసాయ అధికారి తెలిపారు అనంతరం సబ్సిడీలో ఆగ్రోస్ దుకాణంలో లభించును అని రైతులకు సూచించడం జరిగింది 


ఈ కార్యక్రమం లో విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు  జరిగింది.

 లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు.

 రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పునిసరిగా తీసుకోవాలి.

 విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలి.

 వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగర మాత్రమే  విత్తనాలను తీసుకోవాలని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో   మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి , శ్రీకాంత్ నాగిరెడ్డి ,మరియు రైతులు గుర్రాల సత్తయ్య , బాలయ్య ,షేకులు , ఎల్లం, కేశవులు,తదితరులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

Previous లారీపై రైలు ఇంజన్
Next మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
ADVERTISEMENT