Posted on 2024-05-26 14:00:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ ఉన్నత పాఠశాలలో 1987–88 విద్యా సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థులు తమకు విద్యనందించిన
గురువుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ
సమ్మేళనం ఆదివారం షాబాద్ లోని అన్మూల్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒకరికి ఒకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ, గురువులకు నమస్కారం చేస్తూ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ
ఆనందంగా గడిపారు. గురువులు మాట్లాడుతూ మేము విద్యాబుద్ధులు నేర్పించిన వారు మంచి స్థాయిలో ఉన్నందుకు గర్వంగా ఉంది అని, మీరంతా సమాజ
నిర్మాణానంలో భాగస్వాములు కావాలని, ఆత్మీయ
సమ్మేళనం మధుర స్మృతులకు వేదిక అని
మాట్లాడారు, తదనంతరం విద్యార్థులు గురువులను
సన్మానించి మెమెంటోను జ్ఞాపిక అందించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతు మనకు తెలిసిన వ్యక్తే కొద్ది రోజుల తర్వాత కనిపిస్తేనే ఎంతో ఆనందంగా పలకరించి మాట్లాడుతాం.. అదే 10 సంవత్సరాలు కలిసి చదువుకొని ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఎవరి గమ్యంలో వారు వెళ్లి మళ్లీ 37 ఏళ్ల తర్వాత ఒక్క చోట కలిసిన వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆత్మీయ సమ్మేళనంతో అందరూ ఒక్క చోట కలిస్తే ఇక ఆ ఆనందానికి అవధులుండవు అని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >