| Daily భారత్
Logo




ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్

News

Posted on 2026-04-17 04:45:29

Share: Share


ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రియుడికి పుట్టినరోజు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఖరీదైన వాచీలను దొంగిలించిన యువతి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి కారులో జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ వాచ్ షోరూమ్‌కు వెళ్లింది. ప్రియుడిని కారులోనే కూర్చోబెట్టి, ఆమె కస్టమర్‌లా నటిస్తూ షోరూమ్‌లోకి ప్రవేశించింది.అక్కడ సేల్స్‌మెన్‌ను మాటల్లో పెట్టి, సుమారు రూ.2 లక్షల విలువైన రెండు ఖరీదైన తీస్సోట్ వాచీలను చాకచక్యంగా తన హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి పరారైంది. వాచీలు కనిపించకపోవడంతో షోరూమ్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, యువతి వచ్చిన కారు నంబర్ ఆధారంగా ఆమెను ఖమ్మంలో గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.

Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >