Posted on 2026-04-17 05:10:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పెండింగ్‌లో ఉన్న అటవీ, అసైన్డ్ భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ జిల్లాలో అసైన్డ్ భూములకు సంబంధించిన వివిధ సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూములపై అక్రమ ఆక్రమణలను కఠినంగా అరికట్టాలని, ఎక్కడైనా అక్రమాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూముల రికార్డులను సక్రమంగా నవీకరించి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. సర్వే నెంబర్ వారీగా ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల పూర్తి వివరాలను సేకరించి సమగ్ర నివేదికలను తక్షణమే అందజేయాలని సూచించారు. భూముల ప్రస్తుత స్థితి, సమస్యలు, ఆక్రమణల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
ఆక్రమణకు గురైన భూములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు.
అసైన్డ్ భూముల అంశాలలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #LandIssues #AssignedLands #ForestLands #RevenueDept #Telangana
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >