Posted on 2024-04-30 08:19:00
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. వీటికి 5,08, 385 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.
కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో అపశృతి
Posted On 2025-03-23 12:33:58
Readmore >మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
Posted On 2025-03-23 10:21:25
Readmore >120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు
Posted On 2025-03-23 03:09:25
Readmore >ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు
Posted On 2025-03-21 18:08:13
Readmore >