డైలీ భారత్, నంద్యాల జిల్లా: సమాజ సేవా సమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సామన్నగారి గురు ప్రసాద్ ని నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు. సోమవారం నంద్యాలలో జరిగిన సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గురు ప్రసాద్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడు నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు నిత్యం నంద్యాల జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ, విద్యార్థుల సమస్యల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడుతానని ఆయన పేర్కొన్నారు.
News
సమాజ సేవా సమితి ..జిల్లా అధ్యక్షుడిగా గురు ప్రసాద్