| Daily భారత్
Logo




అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి : డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి

News

Posted on 2024-04-15 16:25:43

Share: Share


అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి : డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

సరైన పత్రాలు లేని 32  ద్విచక్ర వాహనాలు,02 ఆటో ,05 కార్ లు స్వాధీనం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా  డిఎస్పీ  మట్లాడుతు...

ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎలాంటి పేపర్లు లేని, సరైన  నంబర్ ప్లేట్స్ లేని 32 ద్విచక్ర వాహనాలు,02 ఆటో లు ,05 కార్ లు సీజ్ చేయడం జరిగిందని ,సబంధించిన వాహన దారులకు సరైన పాత్రలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.

ఒక లీటర్ గుడుంబా,40 లీటర్ల వాష్ అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన కోమణి పై కేసు నమోదు చేసి గుడుంబా, వాష్ సీజ్ చేయడం జరిగింది.

గ్రామాల్లో ఎవరైనా  అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు  ఫోన్  చేసినాచో  వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.

గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో,నేరాల నియంత్రణ లో  సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమాo తరుచుగా నిర్వహిస్తామని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గాంజా, గుడుంబా రవాణా మరియు విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగలు ,డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >