డైలీ భారత్, మెదక్: రాష్ట్ర క్రీడా ప్రాదికార సంస్థ ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతములలో 1-05-2024 వ తేది నుండి 31-05-2024 వ తేది వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు-2024 నిర్వహించబడును.
ఈ శిక్షణ శిబిరాలలో 14 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బాలబాలికలకు వివిధ క్రీడలలో శిక్షణను ఇవ్వబడును. ఇందులో భాగంగా శిక్షణను ఇవ్వడానికి జిల్లాలో గల సీనియర్ క్రీడాకారులు /జాతీయ స్థాయి క్రీడాకారులు/వ్యాయామ ఉపాధ్యాయులు (పిడిs/ పి ఈ టిs) నుండి నెల రోజుల పాటు కోచ్ లుగా పని చెయ్యడానికి దరఖాస్తులు కోరడమైనది.
సీనియర్ క్రీడాకారులు/జాతీయ స్థాయి క్రీడాకారులు అయినచో వారు క్రీడా రంగంలో సాదించిన ప్రగతికి సంబందించిన ద్రువపత్రముల కాపీలను కూడా దరఖాస్తు వెంట జత పరచవలెను.
ఒక్కరు ఏదేని ఒక్క క్రీడకు మాత్రమే శిక్షణ ఇచ్చుటకు దరఖాస్తు చేసుకొనవలెను.
గ్రామీణ ప్రాంతములలో స్థానికంగా వుండి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించగలిగే వారు క్రీడాంశము, ప్రదేశము, గ్రామము మరియు మొబైల్ నెంబర్ తో కూడిన దరఖాస్తును జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయము, రూమ్ నెం. G-07, సమీకృత కలెక్టర్ కార్యాలయము, మెదక్ నందు 18-04-2024 తేది సాయంత్రం 4.00 గం, లోగా సమర్పించవలెనని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకు సంబందించిన ఇతర వివరములకు 9347344440, 9493594388 నెంబర్లను సంప్రదించగలరు.