| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దళితవాడ నుంచి పశువుల అంగడి తీసివేయాలి

దళితవాడ నుంచి పశువుల అంగడి తీసివేయాలి

డైలీ భారత్, తెలంగాణ: దళితవాడ నుండి పశువుల అంగడిని తీసివేయాలని సోమవారం రోజున స్థానిక తహసిల్దార్ గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో ప్రస్తుత గోదల అంగడి నిర్వహిస్తున్న దళితవాడలో ప్రభుత్వం వెచ్చించి క్రీడ ప్రాంగణం నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిందని వారు తెలిపారు. గోదల అంగడి నిర్వహిస్తున్న చుట్టుపక్క ప్రాంతాలలో డిగ్రీ కాలేజీ మైనార్టీ కాలేజీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇలాంటి అనేక విద్యాసంస్థలు ఉన్నాయి అని వారు తెలిపారు. ఇక్కడ గోదల అంగడి నిర్వహించడం వల్ల  దుర్వాసన  విద్యాసంస్థల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు  అనారోగ్యం భారిన పడే అవకాశం ఉన్నందున గోదల అంగడిని వేరే ప్రాంతానికి తరలించి ఈ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను, దళితులను దళిత వాడకట్టును కాపాడాలని సంబంధిత అధికారులకు ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ చెక్కపల్లి పద్మయ్య, దుబ్బాక మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కరాటే మాస్టర్ బూరాని శ్రీకాంత్, రైతు సంఘం జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి, అమ్మన జీవన్ రెడ్డి, దుబ్బాక మున్సిపాలిటీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఇస్తరి గల్ల మల్లేశం, దుబ్బాక యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కడవెర్గు గోపి, తదితరులు పాల్గొన్నారు......

Previous జర్నలిజానికి విలువ లేకుండా చేస్తున్న రాజకీయ నాయకులు
Next జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
ADVERTISEMENT