వరి కుప్పలను ఢీకొని మృతి చెందిన కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోతున్నాయి
రైతులందరూ పోలీసులకు సహకరించాలి
వెల్దుర్తి ఎస్ ఐ నవత గౌడ్
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని వరి ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోస్తే వాటిని ఢీకొని ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆ కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోతున్నాయని ఎస్ ఐ నవత గౌడ్ అన్నారు. సోమవారం మానేపల్లి గ్రామానికి చెందిన దుబాషీ రఘుపతి రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యాన్ని ఢీకొని మృతి చెంది ఆ కుటుంబానికి దూరమయ్యాడని రైతులందరూ తమ యొక్క ధాన్యాన్ని పొలం వద్దనే కల్లాలుగా చేసుకొని ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు. రోడ్డుపైన వడ్లు ఇతర ధాన్యాలు ఆరబోయడం వాటిపై నల్లని కవర్ కప్పడం బండరాళ్లు పెట్టడం ఇలాంటి వాటి వలన ముఖ్యంగా రాత్రి సమయంలో వెళుతున్నటువంటి టూవీలర్ ఇతర వాహనదారులకు రోడ్డుపై కనిపించకపోవడం వలన ఆ వరికుప్పలను తగిలి కింద పడడం. చనిపోయిన సందర్భాలను కూడా చూడడం జరిగిందన్నారు. ప్రస్తుతం రోడ్ల పైన ధాన్యం పోసినవారు ఉంటే వెంటనే వాటిని ఖాళీ చేయాలని లేనియెడల వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తమ కల్లాల వద్దనే ధాన్యాన్ని ఆరబోసుకొని రోడ్డు ప్రమాదాల నివారించడంలో రైతులందరూ సహకరించాలని ఎస్ ఐ నవతా గౌడ్ రైతులను కోరారు