2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు ప్రకటించిన జిల్లా అధ్యక్షులు చింతల లింగం.
ఛలో హైదరాబాద్ March 7
డైలీ భారత్, కామారెడ్డి: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57/4,57/5 మెమోల ప్రకారం మరియు తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ తీర్పు ఆధారంగా 2003DSC ఉపాధ్యాయులకు పాత పెన్షన్ (OPS) అమలు చెయ్యాలి అని 2003 DSC ఉపాధ్యాయుల మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు ఇస్తుందని జిల్లా అధ్యక్షులు చింతల లింగం,ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఉపాధ్యాయులు ఎక్కవ మొత్తంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు తెలిపారు