| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక: మంజుల అనే నేను

శీర్షిక: మంజుల అనే నేను

డైలీ భారత్ స్పెషల్: 

శీర్షిక: మంజుల అనే నేను

గాయాల్ని గుండెల్లో దాచుకుని

గర్వంగా నవ్వడం నేర్చుకున్నాను!

పడిపోతూ కూడా నిలబడటం నేర్చుకున్నాను!

నిశ్శబ్దంగా కనిపించినా

నిర్ణయాల్లో గర్జించే శక్తిని నేను!

నేను మహిళను మాత్రమే కాదు

మార్పుకు మొదటి అడుగు నేను!

నన్ను ఆపాలని ప్రయత్నించిన చేతులు

ఇప్పుడు నా విజయానికి చప్పట్లు కొడుతున్నాయి!

నన్ను ఆపాలని వచ్చిన చీకట్లు

ఇప్పుడు నా వెలుగుకే దారి చూపించాయి!

కన్నీరు పొంగిన ప్రతి క్షణం

నా గుండెల్లో విప్లవం మేల్కొంటుంది!

నన్ను ఆపాలని వచ్చిన ప్రతి మాట

ఇప్పుడు నా విజయ గీతంగా మారుతోంది!

నేను వంటింటి పొగ కాదు

నిరాశలో ఉన్న మహిళా హృదయాలకు ఆశ నింపి

వెలుగుజ్యోతిని వెలిగించాను!

నన్ను అబల అని అన్న వారందరికీ

సహనాన్ని ఆయుధంగా మార్చుకొని

నాయకురాలిగా దారులు చూపించాను!

ఇల్లు నుంచి దేశం వరకు

ప్రతి రంగంలో వెలుగునిచ్చే

ప్రతి మగువకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Previous ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి
Next ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత
ADVERTISEMENT