రంజిత్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
తుక్కుగూడ సంకల్పమే… ఉక్కు సంకల్పమై
భారీ మెజారిటీతో ఎంపి రంజిత్ రెడ్డినీ గెలిపించి తీరతామంటున్న నేతలు...
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : తుక్కుగూడ సంకల్పమే… కాంగ్రెస్ పార్టీకి ఉక్కు సంకల్పంగా మారేలా కనిపిస్తోంది. అగ్రనేతలు ఇచ్చిన సందేశం కాంగ్రేసు కార్యకర్తలకు టానిక్ లా పని చేస్తోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా వేలాది మంది హస్తం సైనికులు చేవెళ్ల కాంగ్రేసు అభ్యర్ది రంజిత్ రెడ్డి గెలుపు కోసం కంకంణ బద్దులై పని చేస్తున్నారు.
సోమవారం పరిగి పట్లణంలోని ఎ బి ఎస్ ఫంక్షన్ హాల్ లో పరిగి నియోజకవరం బూత్ కమిటీ సభ్యుల సమావేశం ఎమ్మెల్యే డాక్టర్ టీ.రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
సమావేశనికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఇటీవల తుక్కుగూడ సభ ఇచ్చిన ఉత్సాహం, ఊపుతో ఎమ్మెల్యేలు సైతం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రెవంత్ ఇచ్చిన సందేశాన్ని గల్లీ గల్లికి తీసుకెళుతున్నారు.
తాజాగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన రెడ్డి సైతం స్తానికంగా నిర్వహించిన సమావేశంలో ఇదే రకమైన పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు విభేదాలను పక్కనబెట్టి కలిసి కట్టుగా రంజిత్ రెడ్డి గెలుపు కోసం పని చేయాలని పిలుపునివ్వటం విశేషం. ఈ రకంగా బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా, గల్లీ నుంచి ఎంపీ పరిధి వరకు తుక్కుగుడ సందేశం వాడవాడలకూ వెళుతోంది. రంజిత్ రెడ్డి గెలుపు ఖాయంగా కనబడుతోంది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసిలు ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.