| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 15లోపు ఫారం-12(డి) సమర్పించాలి

పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్  15లోపు ఫారం-12(డి) సమర్పించాలి

డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: పోస్టల్ బ్యాలెట్ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు ఏప్రిల్ 15 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) 

సమర్పించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు తెలిపారు.

స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నోడల్ ఆఫీసర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 

అత్యవసర సర్వీసులకు చెందిన వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని అన్నారు. 

ఏప్రిల్ 15వ వ తేదీ లోపు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం -12 (డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. 

ఫారం -12 (డీ) దరఖాస్తులు నోడల్ అధికారి నుండి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుండి పొందవచ్చని, సంబంధిత నోడల్ అధికారుల నుండి,ఎన్నికల సంఘం పోర్టల్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 

దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్.ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. 

ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ) అందుబాటులో ఉంటుందని తెలిపారు. *ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఇవ్వరని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది వీరే!

అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది 

కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కింద పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించబడింది... ఈ కేటగిరీలలో పనిచేస్తున్న సిబ్బంది ఎన్నికల రోజున విధులలో ఉండాల్సిన అవసరం ఉంటుంది అవి ఏవంటే వైద్య ఆరోగ్యశాఖ కింద వైద్యరంగంలో, ఏరియా హాస్పిటల్స్ లో పీహెచ్ సి లలో... పనిచేస్తున్న వారు.

అగ్నిమాపక శాఖ కింద పనిచేస్తున్న సిబ్బంది..

రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది డ్రైవర్లు ,కండక్టర్లు, క్లీనర్లు..

ఎన్నికల సంఘం చేత అనుమతించబడిన పాత్రికేయులు..

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా/ పౌరసరఫరాల సంస్థల గిడ్డంగులలో పనిచేసే సిబ్బంది..

విద్యుత్ శాఖలో, సెస్  లో పనిచేస్తున్న సిబ్బంది, ఎయిర్పోర్ట్ అథారిటీ, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, బిఎస్ఎన్ఎల్ మొదలైన సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బందికి ఆబ్సెంట్ ఓటర్స్ కింద ఎన్నికల సంఘం నిర్ధారించినది. 

వారు పోలింగ్ రోజున విధుల్లో ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వారికి పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఆసక్తి కలిగిన వారు అన్ని  రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాలు,  జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోనూ, జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలోనూ , అలాగే సంబంధిత శాఖల జిల్లా అధిపతుల దగ్గర ఉంటుంది. అలాగే జిల్లా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది.. దానిని తీసుకొని వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికోసం పోస్టల్ ఓటింగ్ సెంటర్లో ఓటు వేయడానికి ముందుగానే అనుమతించబడుతుంది...

అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కువినియోగం ఎక్కడంటే.

అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది

ఆర్డీవో ( రిటర్నింగ్ అధికారి) కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

మూడు రోజులపాటు దీనికోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రం ఆర్డీవో కార్యాలయంలో తెరిచిపెట్టబడుతుంది.

 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇట్టి పోలింగ్ స్టేషన్ ఓపెన్ చేసి పెట్టబడుతుంది.

పోలింగ్ స్టేషన్ ఓపెన్ చేయబోయే మూడు రోజుల వివరాలను అన్ని పత్రికల ద్వారా,HOD ల ద్వారా, వీలును బట్టి ఎస్ఎంఎస్ ద్వారా అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బందిలో పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు చేసుకున్న సిబ్బందికి తెలియజేయడం జరుగుతుంది. 

ఈ కార్యక్రమంలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Previous ఉగాది పండుగ ప్రాధాన్యత...
Next రోడ్డుపై వరి ధాన్యం ఆరబోసి ఇతరుల ప్రాణాలకు బాధ్యులు కాకూడదు : వెల్దుర్తి ఎస్ ఐ నవత గౌడ్
ADVERTISEMENT