| Daily భారత్
Logo




మైనార్టీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం :రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

News

Posted on 2023-10-08 17:12:41

Share: Share


మైనార్టీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం :రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: సిఎం కేసిఆర్ నాయకత్వంలోనీ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని మైనార్టీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకం కింద 120 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఒక కోటి 20 లక్షల రూపాయలను అందజేశారు. అలాగే పేద మైనార్టీ మహిళలకు 425 మందికి ఒక్కొక్కరికి పదివేల విలువగల 425 కుట్టుమిషన్లను రాష్ట్ర ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక సిఎం కేసిఆర్ మైనార్టీల కోసం పెద్ద ఎత్తున గురుకులాలు స్థాపించారనీ చెప్పారు. నియోజకవర్గానికి ఒక్క మైనారిటీ గురుకులం పెట్టారన్నారు. మైనార్టీ బాలబాలికలకు ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకులాల ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఇందు కోసం ఏటా ఒక్కో విద్యార్థి పై ప్రభుత్వం ఒక లక్షా 20 వేలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. అన్ని సదుపాయాలతో కూడిన మైనార్టీ గురుకులాల్లో చదివే బాల బాలికలకు మంచి విద్యా బోధన ఉందన్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ,బిసి గురుకులాలలో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండగా మైనార్టీ గురుకులాలకు తమ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. ఫలితంగా కొన్ని మైనారిటీ గురుకులాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మైనార్టీలు చదువు ప్రాధాన్యతను గుర్తించి తమ పిల్లలను ముఖ్యంగా బాలికలను గురుకులాల్లో చేర్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మైనార్టీ గురుకులాలు అన్ని సీట్లు భర్తీ అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,

టేస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య,

రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య , జెడ్పీటీసీ మంజుల, ఎంపీపీ మానస, మైనార్టీ శాఖ ఓసిడి సర్వర్ మియా, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Image 1

అన్న vs బావ... కత్తి దాడితో హాట్ టాపిక్ అయిన కోనరావుపేట

Posted On 2026-08-17 18:17:01

Readmore >
Image 1

అదృష్టం పేరుతో మోసం... టాస్క్‌ఫోర్స్ వలలో 6 మంది

Posted On 2026-08-17 16:03:05

Readmore >
Image 1

₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్‌బుక్‌లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు

Posted On 2026-08-17 15:32:36

Readmore >
Image 1

రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!

Posted On 2026-08-17 15:17:48

Readmore >
Image 1

అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్

Posted On 2026-08-17 15:01:32

Readmore >
Image 1

పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం

Posted On 2026-08-17 14:52:49

Readmore >
Image 1

ప్రజలకు చేరువైన పోలీస్... సిరిసిల్ల జిల్లా గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు

Posted On 2026-08-17 14:30:12

Readmore >
Image 1

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు..

Posted On 2026-08-17 14:29:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-17 14:28:19

Readmore >
Image 1

కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం

Posted On 2026-08-17 14:27:28

Readmore >