| Daily భారత్
Logo




అధికార పార్టీ నాయకులకు సంక్షేమ పథకాలు, ఓట్లు వేసిన ప్రజలకు సున్నం

News

Posted on 2023-10-08 19:41:26

Share: Share


అధికార పార్టీ నాయకులకు సంక్షేమ పథకాలు, ఓట్లు వేసిన ప్రజలకు సున్నం

కాంగ్రెస్ పార్టీ తాలుక కో- ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ..

డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని గంగిమన్ దొడ్డి, పెంచికలపాడు గ్రామాలలో తిరగబడదాం తరిమికోడదాం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ హాజరై,గ్రామంలోని పురవీధులలో తిరుగుతూ బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలు చేసిన అక్రమాలను ప్రజలకు తెలియజేశారు.... అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ చేతులమీదుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ తెలంగాణ మహిళ తల్లులకు అండగా ఉండేందుకు, వారికి భరోసానిచ్చేందుకు, మహిళా తల్లులను లక్షాధికారి (మహాలక్ష్మీ)ని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన గొప్ప పథకం మహాలక్ష్మీ పథకం కింద .మహిళా తల్లులకు ప్రతినెల 2500 రూపాయల నగదు అందజేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రవ్యాప్తంగా  ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,కర్ణాటక ఎన్నికల్లో మహిళా తల్లులకు ప్రతినెల 2000 నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చాం...ఇచ్చిన హామీ మేరకు 1 కోటి 10 లక్షల మంది మహిళా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెలకు ₹2,000 జమ చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం,కర్ణాటకలో మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చిన వెనువెంటనే హామీని నెరవేర్చి మాట నిలుపుకున్నామని,తెలంగాణలోనూ వస్తున్నాం - ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు...గట్టు ఎత్తిపోతలు లేదు, ఎన్నికల సమయంలో మాత్రమే ఈ ప్రాంత‌ నాయకులకు‌ అభివృద్ధి సంక్షేమం గుర్తుకు వస్తుందని, సంక్షేమ పథకాలు పార్టీ నాయకులకు,ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సున్నం అనే రీతిలో పరిపాలన గద్వాల ప్రాంతంలో జరుగుతుందని ప్రజలందరి తెలుసని సరితమ్మ పేర్కొన్నారు.

గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పోటీలో ఉంటున్న ప్రజలందరి ఆశీస్సులతో గెలిపించి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని గ్రామాల ప్రజలను సరితమ్మ కోరారు.

ఈ కార్యక్రమంలో గంగిమన్ దొడ్డి సర్పంచ్ నర్సమ్మ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి,అమరావాయి కృష్ణారెడ్డి,లత్తిపురం వెంకట్రామిరెడ్డి,మాచర్ల వరలక్ష్మి వెంకటస్వామి గౌడ్, గట్టు ధనలక్ష్మి కృష్ణమూర్తి, సత్యనారాయణ,మాచర్ల లక్ష్మణ్,గట్టు గౌస్, మా భాషా,గంగిమన్ దొడ్డి తుమ్మలబావి నరసింహులు,సంతోష్, ఎం.నరసింహులు.రాములు.నాగేష్,పెంచికలపాడ్ ఎంపిటీసి శ్రీ దర్శన్ రెడ్డి, వడ్ల వీరేష్ ఆచారి,మహానంది రెడ్డి, మాజీ సర్పంచ్ షేక్షావలీ,మాల నరసింహులు,గాండ్ల రాఘ,తెలుగు నరసింహ, నవీన్ కుమార్ రెడ్డి,మల్దకల్ మాజీ ఎంపిపి గోవింద్, ఆనంద్ గౌడ్,ఆరగిద్ద నరసింహులు, బల్గేర బజారన్న,ఇందువాసి వసంత్,గురుపద, రమేష్,ఆలూరు రవి, ఆంజనేయులు,గోర్లఖాన్ దొడ్డి వీరన్న,వీరేష్,పాల్వాయి భాస్కర్ రెడ్డి,ఇమ్మానేయిల్,సిక్కిల మల్దకల్, వీరేశ్,కొండపాకు,కుమార్ రెడ్డి, శ్రిను యాదవ్, కుమార్ పాల్వాయి,అయ్యప్ప,తుమ్మలచెరువు శంతన్న, రామకృష్ణ, జనార్థన్, ఈశ్వర్, రాములు, రవి ,బిల్డర్ రామకృష్ణ,లింగాపురం నరసింహులు, దౌల్.డిఆర్.ముని,

 మరియు గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనీ ఈ కార్యక్రమం జయప్రదం చేశారు.

Image 1

అదృష్టం పేరుతో మోసం... టాస్క్‌ఫోర్స్ వలలో 6 మంది

Posted On 2026-08-17 16:03:05

Readmore >
Image 1

₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్‌బుక్‌లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు

Posted On 2026-08-17 15:32:36

Readmore >
Image 1

రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!

Posted On 2026-08-17 15:17:48

Readmore >
Image 1

అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్

Posted On 2026-08-17 15:01:32

Readmore >
Image 1

పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం

Posted On 2026-08-17 14:52:49

Readmore >
Image 1

ప్రజలకు చేరువైన పోలీస్... సిరిసిల్ల జిల్లా గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు

Posted On 2026-08-17 14:30:12

Readmore >
Image 1

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు..

Posted On 2026-08-17 14:29:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : గుడికి వచ్చే భక్తులను మోసం చేస్తున్న ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-17 14:28:19

Readmore >
Image 1

కామారెడ్డి మున్సిపల్ ఆరవ వార్డు లోని మాస్ క్లీనింగ్ ప్రోగ్రాం ప్రారంభం

Posted On 2026-08-17 14:27:28

Readmore >
Image 1

ఆటో కార్మికుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

Posted On 2026-08-17 13:45:49

Readmore >