| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం,గద్వాల్ అభివృద్ధి ధ్యేయంగా : జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ.

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం,గద్వాల్ అభివృద్ధి ధ్యేయంగా : జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ.

తిరగబడుదాం-తరిమికొడదాం కె టి దొడ్డి మండలం, మల్లాపురం తాండ లో

కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాలూక కో - ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ.

మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే

రైతులకు రైతు భరోసా కింద ప్రతి ఏటా 15,000(రైతులు, కౌలు రైతులకు)

12,000 ( వ్యవసాయ కూలీలకు)

వరి పంటకు 500 బోనస్ ఇస్తం

డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం గద్వాల్ మండల పరిధిలోని సంగాల గ్రామంలో తిరగబడదాం-తరిమికోడదాం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల తాలూకా  జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ హాజరై కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు...వీరికి గ్రామ ప్రజలు  ఘన స్వాగతం పలికారు. గ్రామంలో జెండా ఆవిష్కరణ అనంతరం సరితమ్మ మాట్లాడుతూ 

ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలో  నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఉద్యోగ అవకాశాలు తదితర సంక్షేమాలు పథకాలు అన్ని ఇచ్చింది.

మన ప్రభుత్వానికి తెలుసు మన రైతన్నలు పడే కష్టాలు అందుకే మన ప్రభుత్వం రాగానే రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000రూపాయలు అందిస్తాం.ఇది కేవలం రైతులకే కాదు కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తాం.ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నారు ఇన్ని సంవత్సారాలు తీసుకున్నా రుణానికి వడ్డీ కిందకే జమ చేశారు రుణమాఫీని.ఇపుడే వెళ్లి బ్యాంకులో రుణాలు తీస్కొండి.ఇంకో రెండు నెలల్లో మన ప్రభుత్వం రాగానే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం.ఇలాగే మన ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నవి.

గ్రామంలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ విధంగా లబ్ధి చేకూరుస్తాను వారికి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తు జెండా ఆవిష్కరణ కొనసాగించారు.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎవరు అధైర్య పడద్దని అందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజి ఛైర్మెన్  రెడ్డి,అమరావాయి కృష్ణారెడ్డి, గట్టు కృష్ణ మూర్తి, సత్యనారాయణ, ఆనంద్ గౌడ్, మాచర్ల వరలక్ష్మి నర్సింగ్ గౌడ్, కొండపల్లి ఈశ్వర,పూడూరు ఈశ్వర్, భాస్కర్ రెడ్డి,రాఘవేంద్ర రెడ్డి, చింతలకుంట జనార్థన్,రంగస్వామి,ఆంజనేయులు, కే.వెంకటేష్,శ్రీనివాస్ రెడ్డి , పోడూరు ఎర్రవల్లి వెంకటేశ్వరలు, రాఘవేంద్ర రెడ్డి,ఇమ్మానియల్ , రాములు, రవి తదితరులు ఉన్నారు.. మరియు గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనీ జెండా ఆవిష్కరణ నీ విజయవంతం చేశారు.

Previous ఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు మృతి
Next గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు
ADVERTISEMENT