| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల  పై పంచాయతీ కన్ను

కార్మికులకు అన్యాయం చేసే ఉద్దేశం మార్చుకోవాలి అని అంటున్న మాస్ లైన్

డైలీ భారత్, అశ్వరావుపేట: పంచాయతీ వ్యవస్థ ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తే సహించేది లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్   రైతు సంఘం జిల్లా అధ్యక్షులు  పండూరి వీరబాబు హెచ్చరిస్తున్నారు.

 అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం దమ్మపేట రోడ్డు ఇరువైపులా పొట్టకూటికోసం డ్రైనేజీ మీద షాపులు పెట్టుకొని  బ్రతికే కార్మికుల మీద పంచాయతీ కన్ను వేసి తక్షణమే ఖాళీ చేయాలని ప్రతి ఒక్క షాపుకు నోటీసులు పంపించారు. అంటే కార్మికులను వారి కుటుంబాలను రోడ్డు మీద పడేవేయాలని నిర్ణయించుకుందా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్లాట్ఫారం మీద బ్రతికే వారిని వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు పరిస్థితి ఏంటి? వారి జీవనోపాధి ఏంటి అని అన్నారు కార్మికుల మీద కాదు మీ ప్రతాపం బడా బాబులు రోడ్డు పక్కల స్థలాలు ఆక్రమించుకున్న దొంగ పట్టాలు పుట్టించి వారి సొంత స్థలాలు లాగా చలామణి అవుతున్న వారి మీద చూపించాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న సంతపాకల స్థలంలో షెడ్యూల్ నిర్మించి ప్లాట్ఫారం మీద బ్రతికే వారికి ఆసరా కల్పించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లల్లో ఎన్నో అవుతవుకలు ఉన్నాయి ఇల్లు లేని వారి కంటే ముందుగా ఇల్లు ఉన్న వారికే రెండు మూడు ఇల్లు ఇవ్వడం వడ్డీ వ్యాపారస్తులకు పార్టీ కొమ్ము కాసే వారికి తప్ప, ఇల్లు లేని వారికి మొండిచేయి చూపించారు ఇది ఒక ఎత్తు అయితే చనిపోయిన వారికి ఇల్లు కేటాయించడం ఇది మరీ విడ్డూరమన్నారు. మంత్రి శీనన్న మీరు చెప్పిన మాటలకు చేసే పనికి ఒక్కటి కూడా పొంతన లేవు గత ఆయాంలో ఇల్లు ఉన్న వారికి సర్వే చేసి అట్టి వారికి ఇల్లు ఇవ్వబొమన్నారు. అన్నా మరి మీ అనుచరులు దమ్ము పేటలో ఇల్లు లేని వారికి న్యాయం చేయకుండా వారికి వారే దోచుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయమని మండిపడ్డారు. ఇక్కడ డ్రైనేజీల మీద బ్రతికే వారిని ప్రత్యామ్యాయం చూపించాక అప్పుడు తొలగించమని అట్టి విధంగా కాకుండా వారిని వెంటనే తొలగిస్తే సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరిస్తున్నారు.

Previous భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Next అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
ADVERTISEMENT