డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలము అన్నారుగూడెం గ్రామపంచాయతీ గోపాలపేట రెవెన్యూ పరిధిలో బోరు లేకున్నా బోరు ఉన్నట్టు సృష్టించి.8 విద్యుత్ స్తంభాలు,లైన్లతో అక్రమ కరెంటు కనెక్షన్ ఇస్తున్నట్టు గ్రామంలో ఆరోపణలు వెల్లు వెతుతున్నాయి
విద్యుత్ శాఖ మరియు రెవిన్యూ శాఖ అధికారులు ఫీల్డ్ కు వెళ్లకుండానే కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ శాఖ మరియు రెవిన్యూ శాఖ అధికారులు కాసులకు కక్కుర్తి పడి దొంగ పర్మిషన్లు విచ్చలవిడిగా ఇస్తూ పెద్ద మొత్తంలో కాసులు దండుకుంటున్నట్టు ముఖ్యంగా విద్యుత్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు తమ తప్పులను కప్పి పుచ్చుకోవడం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిచిస్తున్నారు.