| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక తదితర కాంట్రాక్ట్ పనుల్లో స్థానిక గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన త్యాగాల ఫలితాలు స్థానిక ప్రజలకు అందకుండా, నీళ్లు, నిధులు, నియామకాల ప్రయోజనాలు ఇతర ప్రాంతాల వారికి మళ్లుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న ఐదవ షెడ్యూల్, వన్ బై సెవెంటీ, పిసా చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి నిబంధనలను ఉల్లంఘిస్తూ సహజ వనరుల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చిన కొందరు ఆంధ్ర కాంట్రాక్టర్లు స్థానిక గిరిజనుల భూములు, అడవులు, సహజ వనరులను దోచుకుంటున్నారని, దీనికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని అలెం కోటి విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన సహజ వనరుల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కొంతమంది కాంట్రాక్టర్లు రాజకీయ అండదండలు ఉన్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడం గిరిజన సమాజానికి, తెలంగాణ ప్రజలకు అవమానకరమని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మేధావులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

లేనిపక్షంలో ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని, ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో గుణపాఠం చెబుతామని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) సెల్:9848553277 హెచ్చరించారు

Previous కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Next ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను
ADVERTISEMENT