| Daily భారత్
Logo




సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

News

Posted on 2026-06-12 16:53:57

Share: Share


సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

వర్షాకాలానికి ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచన

డైలీ భారత్, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ సానిటేషన్ సిబ్బందితో ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో)  ఎల్. రమాదేవి సమావేశమై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సానిటేషన్ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. వేసవి సెలవుల సమయంలో ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, భక్తుల వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంగణాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ సిబ్బంది అంకితభావంతో పనిచేసి పరిశుభ్రతను కాపాడారని ప్రశంసించారు.

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, దోమలు మరియు క్రిమికీటకాల నివారణకు బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, సోఫా ఆయిల్, హిట్, ఆల్ అవుట్ తదితర సామగ్రిని అవసరమైన మేరకు వినియోగించాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, డ్యూటీలకు అనవసరంగా సెలవులు పెట్టకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించడంతో పాటు నిర్ణీత డ్రెస్ కోడ్‌ను పాటించాలని ఆదేశించారు.

అదేవిధంగా సిబ్బందికి ఏవైనా సమస్యలు, అవసరాలు లేదా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. సానిటేషన్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల నాలుగు సెలవులు (ఆఫ్‌లు) మంజూరు చేస్తున్నట్లు ఈవో రమాదేవి గారు ప్రకటించారు.

దేవస్థానానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని ఈవో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్ శర్మ, ఏఈఓ అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, పూజిత, ఆలయ ఉద్యోగులు మరియు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >