Posted on 2026-05-22 16:00:45
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కొత్త కార్లు దగ్ధం అయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు 8 కొత్త కార్లను తరలిస్తున్నారు. తూప్రాన్ శివారుకు చేరుకోగానే లారీ ఇంజిన్ నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే లారీని రోడ్డుపక్కకు నిలిపివేసినా.. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించాయి. మొదట క్యాబిన్‌లో చెలరేగిన మంటలు.. తర్వాత కంటెయినర్ వెనుక భాగంలోని కార్లకు వ్యాపించాయి. రామాయంపేట నుంచి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కంటెయినర్‌తో పాటు అందులోని 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >