| Daily భారత్
Logo




అంతర్రాష్ట్ర బస్సు దొంగల ముఠా అరెస్ట్

News

Posted on 2026-05-21 04:47:15

Share: Share


అంతర్రాష్ట్ర బస్సు దొంగల ముఠా అరెస్ట్

10 తులాల బంగారం, కియా కారెన్స్ కారు స్వాధీనం

జడ్చర్ల పోలీసుల చాకచక్యానికి జిల్లా ఎస్పీ డి.జానకి  ప్రశంసలు

డైలీ భారత్, మహబూబ్‌నగర్: జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న బస్సు దొంగతనాల కేసులను ఛేదిస్తూ, హర్యానా రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ జేబుదొంగల/బ్యాగు దొంగల ముఠాను జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

నిందితుల వద్ద నుండి సుమారు 10 తులాల బంగారం మరియు నేరాలకు ఉపయోగించిన కియా కారెన్స్ కారు (నెం: HR16AB6156) స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

నిందితుల వివరాలు:

A-1 సందీప్ – భివానీ జిల్లా, హర్యానా (ముఠా నాయకుడు, పాత నేరస్థుడు)

A-2 అశోక్

A-3 ప్రవీణ్

A-4 రాజేష్

A-5 సునీల్ కుమార్

A-6 సచిన్ – కారు డ్రైవర్, పాత నేరస్థుడు

నిందితులు రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికుల్లా ఎక్కి, ఒంటరి మహిళలు లేదా బంగారం ఉన్న బ్యాగులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. ప్రయాణికుల మధ్య హడావిడి సృష్టిస్తూ, ఆ సమయంలో షార్ప్‌నర్ కత్తితో బ్యాగులను కట్ చేసి లేదా జిప్ తెరిచి బంగారం దొంగిలించి, బస్సు కదులుతుండగానే దిగిపోయి కారులో పరారయ్యేవారని వెల్లడించారు.

ఈ ముఠా 07.05.2026 న జడ్చర్ల నేతాజీ చౌరస్తా వద్ద ఒక మహిళ బస్సు ఎక్కిన అనంతరం ఆమె బ్యాగులోని బంగారాన్ని దొంగిలించి కర్నూల్ వైపు పారిపోయింది. అలాగే 18.05.2026 న జడ్చర్ల బస్ స్టాండ్ వద్ద ఆటోలో వచ్చిన ప్రయాణికులను వెంబడించి, ఫ్లైఓవర్ సమీపంలో బ్యాగ్ కట్ చేసి బంగారం దొంగిలించి పరారైనట్లు తెలిపారు.

తేదీ 19.05.2026 ఉదయం మళ్లీ దొంగతనం చేయడానికి జడ్చర్ల బస్ స్టాండ్ సమీపానికి వచ్చిన నిందితులను, వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌.ఐ కె.మల్లేష్ మరియు సిబ్బంది గుర్తించారు. పోలీసులు కనిపించగానే నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

• కియా కారెన్స్ కారు – HR16AB6156

• బంగారు నెక్లెస్‌లు – 02

• బంగారు కమ్మలు – 07 జతలు

• ముక్కు పుడక – 01

• బంగారు లాకెట్లు – 03

• బంగారు పట్టీలు – 06

• బంగారు ఉంగరాలు – 03

• మొత్తం సుమారు 10 తులాల బంగారం

నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఈ కేసును సమర్థవంతంగా ఛేదించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జడ్చర్ల ఇన్స్పెక్టర్ కమలాకర్, ఎస్‌.ఐ కె.మల్లేష్, సిబ్బంది విష్ణుమూర్తి (పిసి-368), నరసింహరాజు (పిసి-1233)లను జిల్లా ఎస్పీ డి జానకి, IPS ప్రత్యేకంగా అభినందించారు.

#MahabubnagarPolice

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >