| Daily భారత్
Logo




రాజకీయాల్లో సుందరయ్య మార్గాన్ని అనుసరించాలి

News

Posted on 2026-05-19 10:49:28

Share: Share


రాజకీయాల్లో సుందరయ్య మార్గాన్ని అనుసరించాలి

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నేత మల్లెంపాటి వీరభద్రరావు

సుందరయ్య పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్వహిస్తాం.

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

డైలీ భారత్, వైరా: నేటి రాజకియాల్లో సుందరయ్య మార్గాన్ని అనుసరించాలని, సుందరయ్య పోరాట స్పూర్తితో ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్వహిస్తామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నేత మల్లెంపాటి వీరభద్రరావు, సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. మంగళవారం సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభను స్థానిక బోడేపూడి భవనంలో వైరా డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.  ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మల్లెంపాటి వీరభద్రరావు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు పాలనలో సాగిన వెట్టి చాకిరి, భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపిన మహా నాయకుడు సుందరయ్య అని గుర్తు చేశారు. నేటి రాజకీయ నాయకులు సుందరయ్య అనుసరించిన నిబద్ధత, త్యాగం, ప్రజాసేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి ప్రజల విముక్తి కోసం సుందరయ్య నడిపిన వర్గ పోరాటాలు నేటికీ ప్రజలకు స్ఫూర్తి దాయకమని అన్నారు. ప్రజా సమస్యలపై సుందరయ్య పోరాట పంథాలోనే ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. దేశంలో మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో కూడా మతాన్ని చొప్పించే ప్రయత్నం కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న పాలకులపై పోరాటాలే ప్రత్యామ్నాయ మార్గమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన విస్తృత ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు, పట్టణ నాయకులు హరి వెంకటేశ్వరావు, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, రాచబంటి బత్తిరన్న, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, మల్లెంపాటి రామారావు, మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, కంసాని మల్లికాంబ, ఒర్సు సీతారాములు, కురుగుంట్ల శ్రీనివాసరావు, యనమద్ది రామకృష్ణ, మందడపు రామారావు, మాడపాటి సుజాత, నర్వనేని ఆదిలక్ష్మి, నారికొండ అమరేందర్, అమరనేని కృష్ణ, మాడపాటి రామారావు, దేవుళ్ళు కృష్ణ, సామినేని నర్సింహారావు, ముగ్గు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >